పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్‌లోనే రైల్వే సిబ్బంది మద్యం సేవించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.