సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-2 డివిజన్ పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు-3లో ఆదివారం కోల్ లోడింగ్ సమయంలో డంపర్ భూమిలో కుంగిపోయింది. అప్రమత్తమైన ఆపరేటర్ వెంటనే బయటకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి, డంపర్ ను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు.