భవిత సెంటర్ లను సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం పెద్దపల్లి కలెక్టరేట్ లో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజతో కలిసి భవిత సెంటర్ల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. దివ్యాంగ విద్యార్థులు చదువుకునే ఈ సెంటర్లను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, విద్యార్థుల సంఖ్య, వసతులు, చేయాల్సిన మరమ్మత్తుల వివరాలను తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన అందించే భవిత సెంటర్లలో విద్యుత్ సరఫరా, మౌళిక వసతుల కల్పన పనులు ఈనెల 20 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్