4న జాబ్ మేళా నిర్వహణ..

జిల్లాలోని నిరుద్యోగ యువతకు మెడ్ ప్లస్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించేందుకు నవంబర్ 4, మంగళవారం నాడు సమీకృత కలెక్టరేట్ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్ తెలిపారు. ఈ మేళాలో 40 ఫార్మాసిస్టు, 50 ఫార్మాసిస్టు ఏఐడి, 100 జూనియర్ అసిస్టెంట్, 30 ఆడిట్ అసిస్టెంట్, 20 సిఎస్ఏ, 1 డెలీవరి బాయ్, 1 సెక్యూరిటీ గార్డు, 1 హౌస్ మేయిడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 11 గంటలకు తమ సర్టిఫికేట్ల జిరాక్సులతో వచ్చి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్