పెద్దపల్లి కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా, ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలపై అందిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.