ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల

TG: పంచాయతీరాజ్, R&B శాఖల పెండింగ్ బకాయిలను ప్రభుత్వ విడుదల చేసింది. రూ.1032 కోట్లు విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు, పంచాయతీరాజ్ ఆర్&బి పెండింగ్ బిల్లులు రూ.320 కోట్లు రిలీజ్ చేశారు. రూ.10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్