వరదల్లో చిక్కుకున్న వారిని ప్రాణాలకు తెగించి కాపాడారు (వీడియో)

వరదల్లో చిక్కుకున్న 22 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ముగ్గురు సివిలియన్లను కాపాడేందుకు ఆర్మీ ప్రాణాలకు తెగించింది. పంజాబ్ రాష్ట్రంలోని మాధోపూర్‌లో వరద ఉప్పొంగడంతో వారంతా ఓ భవనంపైకి చేరారు. ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్‌తో వారిని సురక్షితంగా కాపాడారు. అయితే కాసేపటి తర్వాత ఆ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కాస్త ఆలస్యం అయ్యి ఉంటే వారంతా వరదలో కొట్టుకుపోయేవారు.

సంబంధిత పోస్ట్