హైదరాబాద్‌లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చాదర్‌ఘాట్ ప్రాంతంలోని మూసానగర్, శంకర్ నగర్‌లో ఇంట్లలో వరద నీరు చేరింది. స్థానికులను రెవెన్యూ అధికారులు, పోలీసులు అప్రమత్తం చేస్తూ, కొందరు చిన్నారులను బయటకు రాకుండా నియంత్రించారు. పలు కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించగా, కాలనీల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.