ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టులో పిటిషన్

మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాంలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించడం చట్టవ్యతిరేకమని పేర్కొంటూ హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. గత నెల 26న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 71కు వ్యతిరేకంగా హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ హైదర్ ఈ పిటిషన్ వేశారు. నామినేషన్ విధానంలో ఎంపికైన కోదండరాం, అజారుద్దీన్‌లకు రాజ్యాంగం నిర్దేశించిన అర్హతలు లేవని పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి, జీవో 71 అమలును నిలిపివేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్