సిబ్బంది నిద్ర‌పోవ‌డంతో గాల్లో చ‌క్క‌ర్లు కొట్టిన విమానం

ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది నిద్ర‌పోవ‌డంతో పారిస్ నుంచి కోర్సికా ద్వీపానికి ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న విమానం 18 నిమిషాలు గాల్లోనే చ‌క్క‌ర్లు కొట్టింది. కోర్సికా రాజ‌ధాని అజాక్సియోలో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. దాంతో ఆ దిశ‌గా కిందికి దిగుతోంది. కానీ ఎయిర్‌పోర్ట్‌ కంట్రోల్ ట‌వ‌ర్ నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. దీంతో పైల‌ట్ విమానాన్ని గాల్లోనే ఉంచాల్సి వ‌చ్చింది. ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది నిద్ర‌పోవ‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

సంబంధిత పోస్ట్