TG: మంత్రి పొన్నం ప్రభాకర్ రిజర్వేషన్లపై శనివారం మీడియాతో మాట్లాడారు. "దయచేసి బీసీల రిజర్వేషన్లను అడ్డుకోకండి. బలహీన వర్గాల నోటి కాడి ముద్ద లాక్కోవద్దు. 42 శాతం రిజర్వేషన్ల తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం. 10 శాతం EWS రిజర్వేషన్‌లు ఇచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకించలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు" అని మంత్రి పేర్కొన్నారు.