TG: తనను గొప్ప ప్రధాని అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ఇరు దేశాల బంధాలు, సెంటిమెంట్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అభినందిస్తున్నట్లు X వేదికగా పోస్ట్ చేశారు. ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, అమెరికా చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాయని ట్వీట్ చేశారు. కాగా ట్రంప్ ఆందోళన లేదని, రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయని అన్నారు.