దేశ ప్రజలకు ప్రధాని మోదీ బర్త్‌డే గిఫ్ట్

ప్రధాని మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా దేశ ప్రజలకు గిఫ్ట్ ఇవ్వనున్నారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ సేవల కోసం సోమవారం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జేపీ నడ్డా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 75,000 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు వచ్చి ఈ అభియాన్‌లో పాల్గొనాలని నడ్డా విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్