PM మోదీ అమెరికా పర్యటన రద్దు అయ్యింది. ఈనెల 23 నుంచి 29 వరకు న్యూయార్క్‌లో జరగనున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హైలెవెల్ డిబేట్‌కు మోదీ హాజరు కావడం లేదు. ఇటీవల విడుదల చేసిన వివిధ దేశాధినేతల స్పీచ్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 26న మోదీ UN జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే PM స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈనెల 27న స్పీచ్ ఇవ్వనున్నారు. అమెరికా పర్యటన రద్దుకు కారణాలు తెలియాల్సి ఉంది.