చైనాకు ప్రధాని మోదీ.. బంధంలో కొత్త దశ

భారత్‌పై పగబట్టినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీసుంకాలు విధించారు. పైగా, శత్రుదేశం పాకిస్తాన్‌పై వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య చైనాలో ప్రధాని మోదీ 2 రోజులు పర్యటించనున్నారు. షాంఘై సహకార సదస్సులో పాల్గొనడంతో పాటు దేశాధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ మోదీ భేటీ కానున్నారు. ఈ సందర్భానికి ఉన్న మరో ప్రాధాన్యత.. గల్వాన్‌లో సరిహద్దు ఘర్షణల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్