అక్టోబర్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.24,000 కోట్ల నిధులతో ప్రధానమంత్రి ధన్ ధాన్య పథకాన్ని ప్రారంభిస్తారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ముఖ్యంగా తక్కువ ఉత్పాదకత ఉన్న దేశంలోని 100 వ్యవసాయ జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం కింద పంటల వైవిధ్యత మెరుగైన సాగు పద్ధతులు, వ్యవసాయానికి సులభంగా రుణాలు అందించడం వంటి ముఖ్య అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.