కనికరం లేకుండా కొట్టిన పోలీసులు.. విద్యార్థి మృతి (వీడియో)

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో టీఐటీ కాలేజీకి చెందిన విద్యార్థి ఉదిత్ గైకి (22)ని ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు కనికరం లేకుండా కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఉదిత్ కొద్దిసేపటికే కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిని స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.

సంబంధిత పోస్ట్