తమిళనాడులోని కోయంబత్తూరు ఎయిర్ పోర్టు సమీపంలో దుండగులు ఓ యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెల్లకినారులోని ఓ ఆలయం సమీపంలో ముగ్గురు నిందితులు దాక్కున్నట్లు పోలీసులకు తెలిసింది. రాత్రి పోలీసులు కాల్పులు జరిపి నిందితులను అరెస్టు చేశారు. నిందితులు శివగంగకు చెందిన తవసి, కరుప్పస్వామి, కాళేశ్వరన్‌గా గుర్తించారు.