వాగులో చిక్కుకున్న వ్యక్తి.. జేసీబీతో రక్షించిన పోలీసులు (వీడియో)

TG: వనపర్తి జిల్లా మదనపురం పోలీసులు  జేసీబీ సాయంతో వాగు ప్రవాహంలో చిక్కుకున్న రాగుల కురుమయ్య అనే వ్యక్తిని రక్షించారు. మహబూబ్‌నగర్ నవాబుపేట్‌ మండలానికి చెందిన కురుమయ్య, శుక్రవారం రాత్రి కురుమూర్తి దేవస్థానం వెళ్లేందుకు లోలెవల్ వంతెనపై నుండి వెళ్లే క్రమంలో వాగు ప్రవాహంలో చిక్కాడు. సెల్‌ఫోన్‌ లైట్‌తో సంకేతాలు పంపగా పోలీసులు కురుమయ్యను జేసీబీ సహాయంతో గంటపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్