AP: కడప జిల్లాలోని పులివెందులలో దారుణ ఘటన జరిగింది. యాదవారిపల్లిలో ఓ స్థలం వివాదంలో న్యాయం అడిగిన లక్ష్మీదేవి అనే మహిళను పోలీస్ బైక్‌తో ఢీకొట్టారని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఆ మహిళ విషద్రావణం తాగింది, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సుమారు 8 నెలలుగా స్థల వివాదం నడుస్తోంది. తక్షణం న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.