ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో పవర్ బ్యాంక్‌ల వాడకాన్ని నిషేధించింది. అక్టోబర్ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. లిథియం బ్యాటరీల కారణంగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున ఈ ఏడాదే కొత్త భద్రతా నిబంధనలు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది.