యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ‘ప్రతిభా సేతు’ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. దీని ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఒక్కోసారి స్వల్ప తేడాతో సివిల్స్ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోతున్నారని అన్నారు. మెరిట్ లిస్టులో పేరు లేని అభ్యర్థుల వివరాలను ఇకపై ఈ పోర్టల్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఈ వివరాలను ప్రైవేట్ కంపెనీలు తీసుకొని.. వారికి ఉపాధి కల్పించవచ్చని పేర్కొన్నారు.