చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. అమెరికా సుంకాల నేపథ్యంలో వీరి భేటీ ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు ఏడేళ్ల తర్వత ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. తియాజింగ్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) వార్షిక శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యారు.