జాతినుద్దేశించి ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం

ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని పీఎమ్ఓ అధికారికంగా ప్రకటించింది. ఆయన ప్రసంగంలో ఏ అంశాలు ప్రస్తావిస్తారన్నదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అమెరికా ఇటీవలే H1B వీసా ఫీజులను పెంచిన నేపథ్యంలో, మోదీ స్పందిస్తారా అనే చర్చ సాగుతోంది. ఇక దసరా పండుగ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ప్రత్యేక సందేశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్