రేపు ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉత్తరాఖండ్‌లో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలపై హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేయనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పరిస్థితిని ఆరా తీస్తారు. ప్రధాని పర్యటనకు ముందుగా సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామీ జోలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టు వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. ఇప్పటికే మోదీ హిమాచల్‌, పంజాబ్‌లో వరద పరిస్థితులను సమీక్షించారు.

సంబంధిత పోస్ట్