యూట్యూబర్ సప్నాగిల్‌తో వివాదం కేసులో టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాకు కోర్టు ఫైన్ విధించింది. సప్నా గిల్ వేసిన పిటిషన్‌కు సమాధానం దాఖలు చేయడంలో విఫలమైనందున రూ.100 జరిమానా చెల్లించాలని పృథ్వీ షాను కోర్టు ఆదేశించింది. 2023 ఫిబ్రవరి 15న అంధేరీలోని ఓ పబ్‌లో పృథ్వీషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సప్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు FIR నమోదు చేయకపోవడంతో ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.