AP: ఏలూరు జిల్లా చింతలపూడి సమీపంలోని లింగపాలెం శివారు జూబ్లీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ బస్సు ప్రమాదంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.