ఆస్ట్రేలియాలో ఆదివారం ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’ పేరుతో వలస వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. సిడ్నీ, మెల్బోర్న్ సహా పలు నగరాల్లో వేలాదిమంది పాల్గొన్నారు. ఈ నిరసనలో ప్రధానంగా భారతీయ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. మెల్బోర్న్‌లో నిరసనకారులు పోలీసులతో ఘర్షణపడగా.. ఇద్దరు అధికారులు గాయలయ్యాయి. కాగా, ఈ నిరసనలను ఆస్ట్రేలియా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.