TG: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో అలీ కేఫ్ చౌరస్తా సమీపంలోని మూసీ పరివాహక ప్రాంతంలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉస్మాన్ సాగర్ నుంచి భారీగా వరద నీరు తరలిరావడంతో మూసారాంబాగ్ బ్రిడ్జి వద్దకు నీరు చేరింది. ఈ నేపథ్యంలో, అధికారులు వెంటనే స్పందించి కొండచిలువను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.