లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నవంబర్ 5వ తేదీన కరూర్‌కు రానున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రకటించింది. గత నెల 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేగింది. కాగా, అమెరికా పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన రాహుల్ గాంధీ, బాధితులను ఓదార్చేందుకు వస్తున్నారని టీఎన్‌సీసీ నేతలు తెలిపారు.