భారతీయ రైల్వేలో కొత్త లగేజీ రూల్స్ అమలవుతున్నాయన్న వార్తలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్లారీటీ ఇచ్చారు. అది తప్పుడు ప్రచారం అని తెలిపారు. ఎంట్రీ గేట్ల వద్ద స్కానర్లు పెట్టి బరువు చెక్ చేస్తారన్నది పూర్తిగా ఫేక్ న్యూస్ అని అన్నారు. దశాబ్దాల నుంచి అమలులో ఉన్న నిబంధనలు ఇప్పటికీ వర్తిస్తాయని స్పష్టం చేశారు.