దేశ రాజధాని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఒక రైల్వే ప్లాట్‌ఫామ్‌ను స్థానికులు ఇళ్లు కట్టుకుని కాలనీగా మార్చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటనపై ప్రజలు రైల్వే అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌పై నిర్మాణాలు ఎలా జరిగాయని, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జనం నిలదీస్తున్నారు.