తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. ఏపీలోని కడప జిల్లా కమలాపురంలో వాన పడుతోంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాలలో, సిరిసిల్లలోని వేములవాడలో వర్షం కురుస్తోంది. రాబోయే 2 గంటల్లో యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, నారాయణపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.