TG: హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ ఆకస్మిక వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం సిబ్బందిని రంగంలోకి దించారు.