కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

మరికాసేపట్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించారు. అటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చాలా చోట్ల మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్