తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా నుంచి ఏపీ తీర ప్రాంతం మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ మేరకు సోమవారం, మంగళవారం, ఆ తరువాత రెండు రోజులు అనేక జిల్లాల్లో మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపిన వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్