ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గురువారం (జూలై 17) NLG, సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అలాగే ADLB, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, KMM, MBBD, WGL, జనగాం, SDPT, యాదాద్రి భువనగిరి, RR, HYD, VKB, MDK, MBNR, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములు, మెరపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్