స్కూటర్ ను ఢీకొన్న కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు

శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో, కనకమామిడి గ్రామానికి చెందిన కూలి జుంజూరి సామయ్య తన బైక్ పై యూటర్న్ తీసుకుంటుండగా, హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సామయ్య తల, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్