రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా కేసు నమోదు చేసింది. మీడియా కథనాల ఆధారంగా ఈ చర్య తీసుకున్న కమిషన్, డిసెంబర్ 15లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రోడ్లు రవాణా, భవనాల శాఖ, హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్ కు కూడా నివేదిక సమర్పించాలని హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.