బస్సు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీజీపీ

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తాండూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 34 మంది గాయపడగా, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ అవినాష్ మహంతి, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్