రోడ్డు ప్రమాదంలో కంకరలో ఇరుక్కుని బయటకు రాలేక నరకయాతన పడుతున్న ప్రయాణికులు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. కంకర లోడుతో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో బస్సుపై కంకర కుప్ప కూలిపోయి పలువురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తోల్కట్టలోని గురుకుల పాఠశాల మ్యాథ్స్ టీచర్ జయసుధ కూడా కంకర కింద చిక్కుకున్నారు. అదృష్టవశాత్తు ఆమెను రక్షించి నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమెతో రావాల్సిన ఇతర ఉపాధ్యాయులు మరో బస్సులో రావడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.

సంబంధిత పోస్ట్