కొత్తూరులోని జాతీయ రహదారి పెంజర్ల చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నార్సింగి మంచిరేవుల ప్రాంతానికి చెందిన కొండ హరి నాథ్ రెడ్డి (56) అనే పరిశ్రమ మేనేజర్ మృతి చెందారు. మేకగూడ శివారులోని ఓ పరిశ్రమలో మేనేజర్ గా పనిచేస్తున్న ఆయన, కారులో పరిశ్రమకు వస్తుండగా, రియల్ ఎస్టేట్ సైన్ బోర్డును ఢీకొని ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.