రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్ గూడలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లా రాజగోపాల్ గౌడ్, రాజేంద్రనగర్ ఇన్చార్జ్ బిజెపి తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు నేతలు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సేవలను కొనియాడారు.