మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరి

శంషాబాద్ పట్టణంలోని కుమ్మరి బస్తీలో శనివారం ఉదయం ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న జయమ్మ అనే మహిళ మెడలోంచి దుండగుడు పుస్తెలతాడును లాక్కొని పారిపోయాడు. సుమారు తులం బంగారంతో కూడిన పుస్తెలతాడును దొంగిలించినట్లు బాధితురాలు తెలిపారు. సమాచారం అందుకున్న ఆర్.జీ.ఐ.ఏ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్