షాద్ నగర్ పట్టణంలో నూతనంగా దాతల సహకారంతో నిర్మిసున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపు మేరకు ప్రముఖ వ్యాపార వేత్త చందు తన తమ్ముడు కుమారుడు మొదటి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం 52 వేల రూపాయల విరాళం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య పాల్గొన్నారు.