రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో, ఫరూక్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గందే సురేష్ గుప్తా మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 25 వేల నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొగిలిగిద్ద పాఠశాలలో అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు గోదా రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ చేశారు.