ఏరులై పారుతున్న డ్రైనేజీ నీరు.. పట్టించుకునే నాధుడే కరువు

షాద్ నగర్ నియోజకవర్గంలోని లింగారెడ్డి గూడ గ్రామ శివారు రోడ్లు డ్రైనేజీ మురికి కూపాలుగా మారాయి. రోడ్లపై మురికి నీరు పొంగి పొర్లుతుండటంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి. ఈ సమస్య అనేక ఏండ్లుగా పరిష్కారం కావడం లేదు. జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వంలోనూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. ఆదివారం గ్రామ ప్రజలు మీడియా ముఖంగా తమ డ్రైనేజీ సమస్యను తీర్చాలని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్