షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ధృడ సంకల్పం, అచంచల నాయకత్వం, దేశ ఐక్యతకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. శుక్రవారం షాద్ నగర్ ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.