నందిగామ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నందిగామలో గురువారం రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ (38) అనే కార్మికుడు మృతి చెందాడు. పిట్టలగూడ గ్రామంలో పనిచేయడానికి వచ్చిన వెంకటేష్, రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. అతని భార్య సుమతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్