చేగుర్ లో వరి కొనుగోలు కేంద్రo ప్రారంభం

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, నందిగామ మండలం చేగూర్ గ్రామంలో సోమవారం పిఎసిఎస్ ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నాణ్యత కొంచెం అటు ఇటుగా ఉన్నా ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆయన తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని, రైతుల సంక్షేమమే ముఖ్యమని సహకార సంఘం చైర్మన్ గొర్లపల్లి అశోక్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్